603 పరుగుల వద్ద భారత్ డిక్లేర్డ్

ఆస్ట్రేలియాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను 210 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా డబుల్ సెంచరీతోనూ, సాహా సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. దీంతో భారత్‌కు 152 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కుమ్మిన్స్ 4, స్టీవ్ ఓకీఫ్ 3, హేజల్ వుడ్, నాథన్ లేన్ తలో ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.