పుణే టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం

ఆస్ట్రేలియాతో పుణేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 441 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 107పరుగులకే కుప్పకూలిపోయింది. ఆసీస్ యువ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫే టీమిండియాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ మురళీ విజయ్ కేవలం 2 పరుగులకే వెనుదిరగ్గా, అనంతరం మరో ఓపెనర్ రాహుల్ కూడా 10 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 పరుగులే చేసి మరోసారి విఫలమయ్యాడు. ఈ ఓటమితో సొంతగడ్డపై వరుస టెస్టు విజయాలు నమోదు చేసిన కోహ్లీసేన ఆ రికార్డును చేజార్చుకుంది. ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 12 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.