పుణే టెస్టులో భారత్ లక్ష్యం 441

పుణేలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్టేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్ 285 వద్ద ముగిసింది. దీంతో ఆ జట్టుకు 440 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్‌ ధాటికి తట్టుకోలేకపోయిన టీమిండియా 155 పరుగులకే కుప్పకూలింది..అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆసీస్ బ్యాట్స్‌మెన్ త్వరత్వరగానే వికెట్లు కోల్పోయారు..కాని కెప్టెన్ స్మిత్ నిలకడైన ఆటతీరు కారణంగా ఆ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. కాగా, భారత్‌కు రెండున్నర రోజుల ఆట మిగిలివుండటంతో పాటు చివరి రెండు రోజులు పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పడంతో భారత్ నిలకడ ప్రదర్శిస్తే విజయం సాధించడం పెద్ద కష్టం కాదు.