260కే చాప చుట్టేసిన ఆసీస్

భారత్‌తో పుణేలో జరుగుతున్న మొదటి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ 260 పరుగులకే అలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అంతా విఫలమైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్టార్క్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి తొలి రోజే ఆసీస్ అలౌట్ కాకుండా అడ్డుకున్నాడు. 256 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన స్టార్క్ కేవలం ఐదు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత బౌలర్లలో ఉమేశ్ 4, అశ్విన్ 3, జడేజా 2, జయంత్ ఒక వికెట్ తీసుకున్నారు.