గ‌వ‌ర్న‌ర్‌ల‌తో రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి వీడియో కాన్ఫరెన్స్!

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి కరోనా కట్టడి విషయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.  ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌తో పాటు సామాజిక దూరం పాటిస్తూ దేశ‌ప్ర‌జ‌లు స‌మిష్టిగా క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి కృషి చేస్తున్నార‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. 
ఈ డెడ్లీ వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురికాకుండా వారిలో ధైర్యం నింపేలా చ‌ర్య‌లు తీసుకోండని సూచించారు. వైర‌స్ బారిన ప‌డిన బాధితుల‌కు సేవ‌లందించ‌డానికి ముందువ‌రుస‌లో ఉండి డాక్ట‌ర్లు, మెడిక‌ల్ సిబ్బంది, పారిశుద్ధ‌కార్మికులు, పోలీసులు  పోరాడుతున్నారు. వారిపై ఎలాంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం వుందని ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సూచించారు. 


  

ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఉన్న ప‌రిస్థితులు, క‌రోనా ప్ర‌భావం, ప్ర‌త్యేకంగా కేంద్రం ఇచ్చిన ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌ల‌తో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు స‌మీక్షించారు. 
లాక్‌డౌన్ సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌క‌టించిన ప‌థ‌కాలతో పాటు, ప్ర‌త్యేకించి వ‌ల‌స కూలీల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హిరించారు, 
రాజ్‌భ‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను గ‌వ‌ర్న‌ర్‌లు ఉప‌రాష్ట్ర‌ప‌తికి  ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.