అమెరికాకు ఔష‌ధం ఇవ్వ‌డానికి మోడీ పెట్టిన ష‌ర‌తు ఏమిటి?

అమెరికా అడిగిన మూడు కోట్ల హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధాన్ని అమెరికాకి సప్లై చేయడానికి భారత్ ఒప్పుకుని స‌ప్లాయి చేస్తోంది. అయితే బదులుగా కొన్ని షరతులు పెట్టింది భారత్.
1. ఎలాంటి ఆంక్షలు లేకుండా భారత ఫార్మా సంస్థలు అమెరికన్ మార్కెట్ లో అమ్ముకోనివ్వాలి.
2. FDA భారత ఫార్మా సంస్థల మీద విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించాలి.
3.FDA ఇకముందు భారత ఫార్మా సంస్థలను పేటేంట్లు మేధోహక్కులు పేరుతో వేధించకూడదు.
ట్రంఫ్ ప్రభుత్వం 24 గంటలలోపే ఈ షరతులకి ఒప్పుకుంది. అంతేకాదు గత మూడు సంవత్సరాలుగా నిషేధంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లోఉన్న IPCA ఫార్మా మీద ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది.
Ipca laboratories, Zydus Cadila and Wallace Pharmaceuticals కలిపి ఒక నెలలో 10 కోట్ల టాబ్లెట్స్ తయారుచేయగల సామర్ధ్యం కలిగి ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ [Ministry of Health and Family Welfare] 10 కోట్ల టాబ్లెట్స్ కోసం Ipca laboratories, Zydus Cadila లకి ఆర్డర్ చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రాడక్షన్ మొదలయాయి.