భారతదేశం పరువు తీసిన సర్వే

భారతదేశం.. సాంప్రదాయాల నిలయం.. స్త్రీలను గౌరవించడం ప్రపంచానికి నేర్పిన దేశం.. ఇలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం.. కానీ ఇప్పుడు భారతదేశం సిగ్గుతో ప్రపంచం ముందు తల దించుకుంటుంది.. ప్రపంచానికి స్త్రీలను గౌరవించడం నేర్పించిన మనం, విలువలు మర్చిపోయి భారతదేశ పరువుని నడి ప్రపంచంలో తాకట్టు పెడుతున్నాం.. దానికి రుజువే తాజాగా వెల్లడైన థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే.. మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశమని ఈ సర్వే వెల్లడించింది.

అత్యాచారాలు, లైంగిక వేధింపులు,మహిళల అక్రమ రవాణాలో భారత్ అగ్రస్థానంలో ఉందట.. అలానే  మహిళల భద్రత విషయంలో భారత్ మహా డేంజర్ అంటూ సర్వే వెల్లడించింది.. లైంగిక వేధింపులతో పాటు, బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు ఇలా అన్నింట్లో భారత్ ముందు వరుసలో ఉందని ఈ సర్వే వెల్లడించింది.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకి పోటీ ఇవ్వాలన్న ఆలోచన దగ్గరే ఆగిపోయిన భారతదేశం, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా మొదటి స్థానం రావడం భారతీయులుగా సిగ్గుపడాల్సిన విషయం.. ఇప్పటినుండైనా స్త్రీలను గౌరవిద్దాం.. భరతమాత పరువు కాపాడదాం.