పాక్ కు భారత్ మరో నిక్ నేమ్..

 

పాకిస్థాన్ కు ఇప్పటికే 'టెర్రరిస్థాన్ అని పేరు పెట్టిన భారత్ ఇప్పుడు తాజాగా మరో పేరు పెట్టింది. అదేంటంటే...ఎస్టీజెడ్  అంటే.. స్పెషల్ టెర్రరిస్ట్ జోన్. జెనీవాలో జరిగిన ఐరాస సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల విభాగంలో భారత రెండో కార్యదర్శి మినీ దేవి కుమమ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ను ఎస్ టీజెడ్ స్పెషల్ టెర్రరిస్ట్ జోన్ గా అభివర్ణించారు. పాకిస్థాన్ లో ప్రత్యేక టెర్రరిస్టు జోన్ లు ఎన్నో ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని తాము ఎంతగా డిమాండ్ చేస్తున్నా ఆ దేశం స్పందించడం లేదని ఆరోపించారు. పాక్ లో మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిజమైన సమస్య పాకిస్థాన్ ఉగ్రవాదమేనని ఎస్ టీజెడ్ లను నడుపుతున్న పాకిస్థాన్ తమను విమర్శించడం ఏంటని ఆమె నిలదీశారు.