ఎయిర్ టెల్ బాటలో ఐడియా...

Publish Date:Jan 12, 2017

 

జియో దెబ్బకి మిగిలిన టెలికాం సంస్థలు కూడా ఫ్రీ ఆఫర్స్ వెంట పడ్డారు. ఇప్పటికే పలు ఆఫర్లను వినియోగ దారుల ముందు ఉంచిన టెలికాం సంస్థలు ఇంకా మరికొన్ని ఆఫర్లతో ముందుకొస్తుంది. దీనిలో భాగంగానే ఎయిర్ టెల్ ఇప్పటికే 4జీ నెట్ వర్క్ కలిగి ఉన్న వారికి ఈ ఏడాది మొత్తం 4జీ ఉచిత డేటా అఫర్ ఇచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఐడియా కూడా ఇలాంటి ఆఫరే ప్రకటించింది. కొత్త ఐడియా 4జీ డేటా ఆఫర్ కింద రూ.348తో రీచార్జ్ చేసుకుంటే 1జీబీ డేటాను, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లను ప్రస్తుత ప్రీపెయిడ్ 4జీ హ్యాండ్ సెట్లు కస్టమర్లు పొందవచ్చు. అదే కొత్త 4జీ హ్యాండ్సెట్ల కస్టమర్లయితే అదనంగా 3జీబీ డేటాను పొందుతారని ఐడియా పేర్కొంది.  ఇంకా పోస్టు పెయిడ్ కస్టమర్లయితే రూ.499 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్తో 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లు అపరిమిత లోకల్, నేషనల్, ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్తోపాటు 3జీబీ ఉచిత డేటాను పొందవచ్చు.  కాగా 28 రోజుల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని.. ఏడాదిలో 13 సార్లు రీచార్జ్ చేసుకుని ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

By
en-us Politics News -