పెట్రోల్, డీజిల్ రూ.35 - రూ.45 కే ఇస్తారట..!!

 

పెట్రోల్ ధర పెరుగుతున్న కొద్దీ సామాన్యులకు ప్రభుత్వం మీద మంట పెరుగుతుంది.. ఇప్పటికే 90 కి చేరువైన పెట్రోల్ ధర త్వరలో 100 కి చేరుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. పెట్రోల్ ధర విషయంలో ప్రతిపక్షాలు, ప్రజలు ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. అయితే ఈ విషయంపై రామ్ దేవ్ బాబా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. తాజాగా రామ్ దేవ్ బాబా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ధరల పెరుగుదల కారణంగా వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు.. తాను గనుక ప్రభుత్వంలో ఉండి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలపై వినియోగదారులకు ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చేవాడినని.. పెట్రోల్, డీజిల్‌లను రూ.35 నుంచి రూ.45 మధ్య ఇచ్చేవాడినని చెప్పారు.