తాగుబోతు అమ్మాయిలతో రోడ్లపై జాగ్రత్త...

Publish Date:Jan 11, 2017

 

ఇదేదో సినిమా టైటిల్ కాదు..నిజంగా జరిగిన సంఘటన..ప్రజంట్ అబ్బాయిలతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అమ్మాయిలు..అబ్బాయిల్లా డ్రెస్సింగ్..అబ్బాయిల్లా డ్రైవింగ్‌.. అబ్బాయిల్లా డ్రింకింగ్. ఇలా ప్రతి పనిలో అబ్బాయిలను మించిపోతున్నారు నేటి కాలం అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు మందు కొడతారన్నది బహిరంగ రహస్యమే. ఒకపక్క మందు కొడుతూ..మరో చేత్తో డ్రైవింగ్ చేయడం లేటేస్ట్ ట్రెండ్..ఇప్పుడు ఇదే అలవాటుని అందిపుచ్చుకున్నారు హైదరాబాద్ అమ్మాయిలు. ఇటువంటి సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌‌లో జరిగింది. తాగుతూ..తూగుతూ డ్రైవ్ చేస్తున్న అమ్మాయిలకి మద్యం మత్తు నెత్తికెక్కడంతో ఒళ్లు తెలియని మైకంలో ముందు వెళ్తున్న మూడు వాహనాలను ఢీకొట్టడంతో పాటు..రోడ్డున వెళుతున్న పాదచారులను ఢీకొట్టారు. అదేంటని ప్రశ్నించబోయిన ఓ కారు డ్రైవర్‌ని అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారు..విషయం తెలిసి వచ్చిన ట్రాఫిక్ పోలీసులను వదల్లేదు. ఎలాగోలా మందు భామలను అదుపులోకి తీసుకుని కారు చెక్‌ చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. వారు వచ్చిన కారులో స్టీరింగ్ పక్కనే సగం తాగిన మద్యం గ్లాస్‌లతో పాటు మద్యం బాటిళ్లని కనుగొన్నారు. బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేయగా, డ్రైవ్ చేస్తున్న యువతి విపరీతంగా మద్యం సేవించినట్లు తేలింది. కారును సీజ్ చేసిన పోలీసులు ఆ యువతిపై డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి యువతి తల్లిదండ్రులను కూడా కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఇంత రచ్చ చేసిన తాగుబోతు అమ్మాయి హైదరాబాద్‌ సోమాజీగూడకు చెందిన యువతి. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

By
en-us Analytical News -