హైద‌రాబాద్ మెట్రోలో అమీర్ పేట స్పెష‌ల్


ఎన్నో ఏళ్లుగా భాగ్య‌న‌గ‌ర వాసులు వెయ్యి క‌ళ్ల తో ఎదురుచూస్తోన్న హైద‌రాబాద్ మెట్రో ఈ నెల‌లోనే ప‌రుగులు తీయ‌బోతోంది. ప్రధాని న‌రేంద్ర‌మోడీ న‌వంబ‌ర్ 28న హైద‌రాబాద్ మెట్రోను జాతికి అంకితం చేయ‌నున్నారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద పబ్లిక్ - ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న మ‌న మెట్రోలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు సంత‌రించుకున్నాయి. భాగ్య‌న‌గ‌రంలో ఎన్నో మెట్రో స్టేష‌న్లు ఉండ‌గా.. వాట‌న్నింటిలోకి అమీర్ పేట స్టేషణ్
సంథింగ్  స్పెష‌ల్ అట‌. దీని ప్ర‌త్యేకత‌లు ఏంటో ఒక‌సారి చూస్తేః

* ఇది ఇంట‌ర్ చేంజ్ మెట్రో స్టేష‌న్.. దీని విస్తీర్ణం 2 ల‌క్ష‌ల చ‌ద‌రపు అడుగులు.. పొడ‌వు 476 అడుగులు కాగా... వెడ‌ల్పు  148 అడుగులు. ఈ స్టేష‌న్ నుంచి ఒకేసారి 4 మెట్రో రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.  

* దీనిని మూడు అంత‌స్తుల్లో నిర్మించారు. మొద‌టి అంత‌స్తులో టికెటింగ్, ఎంట‌ర్ టైన్ మెంట్, షాపింగ్ లు ఉంటాయి. రెండో అంత‌స్తులో ఒక మార్గం నుంచే వ‌చ్చే రైళ్లు ఆగుతాయి. మ‌రో మార్గం నుంచి వ‌చ్చే రైళ్లు మూడో అంత‌స్తులో ఆగుతాయి.

* హైద‌రాబాద్ లోని అన్ని మెట్రో స్టేష‌న్ ల‌లో రైళ్లు 20 సెక‌న్లు మాత్ర‌మే ఆగుతాయి. కానీ అమీర్ పేటలో మాత్రం రెండు నిమిషాలు ఆగుతుంది.

* ఈ స్టేష‌న్ లో 12 ఎస్కలేటర్లు, 16 లిఫ్టులు, 12 మెట్ల మార్గాలు ఉన్నాయి.