తేనెని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా!

 

మనకి అందుబాటులో ఉన్న పదార్థాల్లో తేనెని మించిన మందు లేదు. దగ్గు తగ్గాలన్నా, డైజషన్‌ బాగుపడాలన్నా, నేచురల్ యాంటీబయాటిక్‌లా పనిచేయాలన్నా... తేనె గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది. తేనెలో ఉండే ప్రొటీన్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఒంటికి కావల్సిన బలాన్ని కూడా అందిస్తాయి. తేనెలో ఫ్రక్టోజ్‌ అనే షుగర్‌ ఉంటుంది. ఇది ఒకేసారి ఒంట్లో కలిసిపోకుండా, నిదానంగా కలుస్తుంది. దాని వల్ల ఒబెసిటీ కూడా అదుపులో ఉంటుంది. కానీ తేనెని దేనిలో కలిపితే effectiveగా ఉంటుందో మీకు తెలుసా!

- పరగడుపునే ఓ చెంచాడు తేనెని గోరువెచ్చటి నీటిలో తీసుకుంటే చాలా ఉపయోగం. గోరువెచ్చటి నీటిలో తేనె పూర్తిగా కరిగిపోతుంది. నాలుక దగ్గర నుంచి కడుపు దాకా అన్ని అవయవాలను ఇది కవర్‌ చేసేస్తుంది. క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వల్ల లివర్లో ఉన్న toxins అన్నీ బయటకి వెళ్లిపోతాయి. క్రమంగా కొవ్వు కణాలు కూడా కరగడం మొదలుపెడతాయి.

- అవకాశం ఉంటే తేనెని గోరువెచ్చని నీటితో పాటు నిమ్మరసం కూడా కలిపి తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్‌ C ఉంటుందన్న విషయం తెలిసిందేగా! చాలామందికి రోజూ, కావల్సినంత విటమిన్ C అందదు. నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఆ లోటు తీరిపోతుంది. ఒంట్లో ఇమ్యూనిటీ పెరగాలన్నా, గుండెజబ్బుల సమస్య తగ్గాలన్నా, చర్మంలో గ్లో ఉండాలన్నా C విటమిన్ చాలా అవసరం. అంతేకాదు! నిమ్మరసంలో ‘గ్లూటధియోన్‌’ అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరాన్ని detoxify చేసేందుకు, బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది.

- గోరువెచ్చటి నీటిలో ఓ స్పూన్‌ తేనెతో పాటు చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకున్నా మంచిదే! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటాబాలిజం రేట్‌ని పెంచుతుంది. దానివల్ల కొవ్వు కణాలు త్వరగా కరిగిపోతాయి. పైగా ఆహారం కూడా త్వరత్వరగా జీర్ణమైపోతుంది.

- వెచ్చటి నీళ్లలోనే కాదు, గోరువెచ్చని పాలల్లో తేనె కలిపి తీసుకున్నా ఉపయోగమే! పాలల్లో ఎన్ని విటమిన్స్‌ ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇందులో తేనె కూడా కలిపడం వల్ల respiratory problems తో పాటు చాలారకాల digestion problems కూడా తగ్గిపోతాయి. తేనె, పాల కాంబినేషన్‌ రాత్రిపూట తీసుకోవడం వల్ల నిద్ర కూడా త్వరగా పడుతుంది.