ఇంటి ఆహారమే బెస్ట్...!!

ఆర్భాటపు ప్రచారాలే తప్ప ఆరోగ్యం మార్కెట్ లో దొరకదు

మన చిన్నప్పుడు ఇంట్లో వండే ఆహారమే ఆరోగ్యకరమైనది అని చెప్పేవాళ్ళు.. 1990 నాటికి బ్రేక్ ఫాస్ట్ రెవల్యూషన్ వచ్చాక మెల్లిగా కార్న్ ఫ్లెక్స్ (మొక్కజొన్న చిప్స్) మన డిన్నర్ టేబుల్ పైకి వచ్చి చేరాయి. ఆ తర్వాత గ్రీన్ టీ చేరిపోయింది. వాటితో పాటు కినోవా, ఓట్స్, స్మూతీ, కాలే,  మొలకలు మన రోజు వారీ ఆహారంలో భాగంగా మారిపోయాయి. క్రమంగా ఇవి మన సంప్రదాయ వంటకాన్ని ఆక్రమించాయి. కానీ ఇవి ఆరోగ్యకరమైనవేనా..?

2020లో ఉన్న మనం ఉహన్ లో మొదలైన వైరస్ సృష్టించిన ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నాం. ఆరోగ్యం ముఖ్యమని అందరం గ్రహించాం. ఈ సమయంలో రోగనిరోధక శక్తి పై ఆసక్తి పెరిగింది. లడ్డు, మిల్క్ షేక్స్, ఐస్క్రీమ్ మొదలైన ప్రతి ఒక్కటి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని ప్రచారం జరుగుతోంది.

ఒక్కసారి ఇన్స్టగ్రామ్ ని ఓపెన్ చేసి హెల్త్ అండ్ వెల్నెస్ గురించి వెతికితే 4.2 మిలియన్(42లక్షల) పోస్టులు కనిపిస్తాయి. కేవలం హెల్త్ అనే పదాన్ని టైప్ చేసి చూసిన 122 మిలియన్ (కోటీ 22లక్షల) పోస్టులు దర్శనమిస్తాయి. ఆరోగ్య సంబంధమైన వాటి గురించి 161 మిలియన్ పోస్టులు, ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి 30.5 మిలియన్ పోస్టులు కనిపిస్తాయి.

మనకు తెలుసా Pinterest అనే సైట్ protein కేటగిరిని సృష్టించిందంటే దీని తీవ్రత ఎంత ఉందో. అందుకే ఆరోగ్యానికి సంబంధమైన పోస్టులు ఇన్ స్టాగ్రామ్ లో ప్రవాహంగా ప్రారంభమయ్యాయి. స్లిమ్ గా ఉండటమే ఆరోగ్యంగా ఉండటంగా, ఆరోగ్యంగా ఉండటం అంటే స్లిమ్ గా ఉండటంగా  అన్న విధంగా మన ఆలోచన మారిపోయింది.

ఇవాళ ప్రపంచ మార్కెట్ లో  హెల్త్ ఇండస్ట్రీ విలువ 4.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక రంగంలో 5.3 శాతం. షార్ట్ కట్ మార్గంలో ఆరోగ్యాన్ని వినిమయ వస్తువుగా మార్చడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఉదాహరణకు హెల్త్ కు సంబంధించి గ్రీన్ టీ ఇవాళ ఎక్కువ అమ్ముడుపోతున్నదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ మార్కెట్ లో  2019 నాటికి గ్రీన్ టీ ఉత్పత్తుల విలువ 18.4 బిలియన్ డాలర్లు. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక మంచి ఔషధం గా భావిస్తున్నారు. ప్రతిరోజూ మూడు కప్పుల గ్రీన్ టీ సేవిస్తే సూపర్ హ్యూమన్ గా మరిపోతారని భావిస్తున్నారు. శరీరంలోని అదనపు క్రొవ్వు కరిగిపోతుందని, మధుమేహం అదుపులో ఉంచుతుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని, క్యాన్సర్ వంటి వాటిని రాకుండా చేసుందని వింటున్నాం. కానీ అది నిజమా..?

అయితే గ్రీన్ టీ పై పరిశోధన చేసిన వాళ్ళు మాత్రం  ఇది బరువును తగ్గించదు. కానీ ఇది తాగడం వలన శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఒకరకంగా ఇది బ్లాక్, బ్లూ మొదలైన ఏ టీ తీసుకున్న ఇదే జరిగేది. ఇక గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ విషయానికి వస్తే అది గ్రీన్ టీ అయినా బ్లాక్ టీ అయినా అందులో ఒకే రకమైన క్యాట్కిన్స్ (catkins)ఉంటాయని సైన్స్  చెప్పుతుంది. మరి అలాంటప్పుడు గ్రీన్ టీ తీసుకోవచ్చా అంటే తప్పకుండా తీసుకోవచ్చు కానీ అది బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అని మాత్రం చెప్పలేం.

అలాగే గ్లూటెన్ ఫ్రీ ఆహారపు ఉత్పత్తులు కూడా ఇప్పుడు మార్కెట్ లో పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి. గ్లూటెన్ ఫ్రీ ఆహారంలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉండని వెల్ నెస్ బ్లాగర్లు చెప్తున్నారు. మరి దీంట్లో ఎంత నిజముంది అని సైన్స్ లో వెతికితే కాదనే చెప్తోంది. గ్లూటెన్ అనేది గ్లియాడన్ లాగా ప్రోటీన్స్ కలయిక . ఇది బార్లీ, గోధుమ వంటి కార్బోహైడ్రేట్లలో దొరుకుతుంది. మరి ఇవన్నీ తీసుకోవడం ఆరోగ్యానికి నష్టమా అంటే కాదనే చెప్పవచ్చు.ఉదరకుహర వ్యాధి (సెలియాక్  డీసీజ్)అనే ఒక జన్యుపరమైన వ్యాధి ఉన్నవాళ్లు మాత్రమే గ్లూటెన్ ఫ్రీ ఆహారం తీసుకోవాలి. ఇతరులు దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా జనాభాలో 5 శాతం కంటే తక్కువ మంది మాత్రమే సిలియాక్ డీసీజ్ తో ఉన్నారు.  కానీ 12 శాతం మంది ఈ గ్లూటెన్ ఫ్రీ ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇది అమెరికన్ జనాభాలో ఒక్క శాతం మందికే సమస్యగా మారితే 20 శాతం మందికి పైగా అక్కడ గ్లూటెన్ గ్రీ ఆహారాన్ని తీసుకుంటున్నారు. సెలియాక్ డీసీజ్ ఉన్నవారు  జంక్ ఫుడ్,ఫ్రెడ్, పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటివాటికి దూరంగా ఉంటే చాలు.  అందుకే గ్లూటెన్ ఫ్రీ వల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పవచ్చు. గత మూడేళ్లులో గ్లూటెన్ ఫ్రీ మార్కెట్ విలువ 6.47 బిలియన్ డాలర్లు. 2027 నాటికి 43. 64 బిలియన్ డాలర్లుకు చేరుకుంటుంది మార్కెట్ వర్గాల అంచనా.

మనలో చాలామంది ఆవు పాలను తాగి పెరిగాము. కానీ ఇప్పుడు ఆవు పాలు తాగితే శరీరంలో ఫ్యాట్ (కొవ్వు ) ను పెంచుతుందని తాగడం లేదు. వాటి స్థానంలో బాదం పాలు (Almond Milk), సోయా మిల్క్ (Siya milk) వచ్చి చేరాయి. ప్రపంచ మార్కెట్ లో బాదం మిల్క్  విలువ 2025 నాటికి 13.3 బిలియన్ డాలర్ల కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సోయా మిల్క్ మార్కెట్ విలువ 23.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. పోనీ ఇవి ఆవు పాలకు ప్రత్యామ్నాయ అనుకోవాలా? బాదం పాలు, సోయా పాలు, ఆవు పాల కంటే మెరుగైనవి అని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. న్యూట్రిషన్, ప్రోటీన్ పరంగా చూస్తే ఆవుపాలే ముందంజంలో ఉన్నాయి. శాఖాహారులు, లేదా ల్యా క్టో ఇంటాలరెన్స్ తో బాధపడేవారు కాకకుంటే సోయా, బాదం పాలను తీసుకోవాల్సిన అవసరమే లేదు. నిరభ్యంతరంగా ఆవుపాలను తీసుకోవచ్చు.

వీటి సరసన చేరిన ఇంకో ఉత్పత్తి ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ బాక్స్ లు చూడటానికి డంబుల్స్ లా బరువుగా, బంగారంలా ఎక్కువ ధర లో ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ అనేది కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే. మహిళలకు 46 గ్రామ్స్, పురుషులు 56 గ్రామ్స్  ప్రోటీన్స్  ప్రతి రోజు అవసరం అవుతుంది. ఇవి గుడ్లను, నట్స్,, చికెన్,  సోయాబీన్స్ ద్వారా శరీరానికి కావల్సినంత అందుతుంది. వీటిని ఆహారంలో భాగంగా ఎవరైతే తీసుకోలేరో వాళ్ళు  తీసుకున్నా ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా అర్థం ఉంటుంది.  కానీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ ప్రోటీన్ పౌడర్ మార్కెట్ విలువ 5.28 మిలియన్ డాలర్లుగా ఉంది.  వీటిని అమ్మే ఎవరు కూడా వీటి ద్వారా వచ్చే సమస్యల గురించి చెప్పరు. ఇవి కొత్త ఉత్పత్తులు కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. అయితే  దీనివల్ల దీర్ఘకాలికంగా ఎటువంటి సమస్యలు వస్తాయో కూడా తెలియ కూడానే వాడుతున్నాం.

ఇవేకాదు వైట్ రైస్ బదులు బ్రోన్ రైస్ అంటూ, తక్కువ క్యాలరీలు, ఫ్యాట్ ఫ్రీ, ఎయిర్ ప్రేడ్, కొలెస్ట్రాల్ ఫ్రీ అని ఒక్కటేమిటి అనేక రకాలుగా ప్రచారం. ఇక రుచికోసం స్నాక్స్ లలో ఎక్కువ మోతాదులో చక్కెర కారకాన్ని కలుపుతారు. కానీ వాటిని టెక్నీకల్ నేమ్స్ తో రాయడం  వల్ల చాలామంది గమనించలేక పోతున్నారు. యూరప్ లో మోనోసోడియం గ్లుటామిన్ (MSG) గా, దాన్ని E-621 సంఖ్యతో, క్యారగీనన్ ను E- 407 సంఖ్యతో చూపిస్తారు. వీటిని జాగ్రత్తగా చదివితే అర్థం అవుతుంది.  రెడీమేడ్ గా తయారు చేసిన పెరుగులో కూడా ఎక్కువ మోతాదులో చక్కెరను కలుపుతారు. ప్రోటీన్ బార్స్ అన్ని కూడా ఒకరకంగా అనారోగ్య కారకమైనవే. వెజిటబుల్ చిప్స్, పోటెటో చిప్స్ కూడా ఇలాంటివే.

విటమిన్ వాటర్ కూడా మెరుగైనది అని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ప్రతి విటమిన్ వాటర్ బాటిల్ లో ఎనిమిది టీ స్పూన్ ల చక్కెర ఉంటుంది. అలాగే కోకోకోలా కంపెనీలు కూడా ఎక్కువ మోతాదు కు ఫండింగ్స్ రీసెర్చ్ కి కేటాయించి తప్పుడు సమాచారంతో తమ ఉత్పత్తులను అమ్ముకుంటుంది. 1960లో ఇలాగే POM అనే బేవరిజస్ కంపెనీ హర్ట్ డిసేజెస్ ను, ప్రొటెస్టేట్ క్యాన్సర్ ను నిరోధిస్తోంది అంటూ 35 మిలియన్ డాలర్లను ప్రచారం నిర్వహించేందుకు ఖర్చు చేసినట్లు ఈ మధ్యే తెలిసింది.

వీటన్నింటినీ చూసిన తర్వాత మనకు అనిపించేది, మనకు అర్థమయ్యే వాస్తవం ఏమిటంటే అన్నింటికన్నా ఇంటి ఆహారమే బెస్ట్ అని..