ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు ఏ పరిష్కారాన్ని చూపనుంది?

 

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. రూట్ల ప్రైవేటీకరణ పై కేబినెట్ తీర్మానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. పధ్ధెనిమిది అంశాలతో కూడిన అఫిడవిట్లలో ఆర్టీసీ పై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.పధ్ధెనిమిది అంశాలతో కూడిన అఫిడవిట్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి హైకోర్టుకు సమర్పించారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది వాధనలు వినిపించారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని నివేదిక ఇచ్చారు.

ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని పేర్కొన్న హైకోర్టు.. విచారణను రేపట్టికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానం కాపీని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.

రెండు రోజుల క్రితం హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి 11 వ తేదీ డెడ్ లైన్ పెట్టింది.ప్రభుత్వాన్ని పదకొండు లోపు  చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలి అదే విధంగా నాలుగు డిమాండ్లకు సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలను ఆర్టీసీ ఇవాళ్ళీ చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ రోజు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.ఆర్టీసీ  ఐదు వేల కోట్ల పైగా నష్టాల్లో ఉన్నతరుణంలో రెండు వేల కోట్ల రూపాయలు అత్యవసరంగా ఆర్టీసీ బకాయిల పడనున్నది కాబట్టి ఇప్పుడున్న నలభై ఏడు కోట్ల రూపాయలు ఇస్తే సరిపోవు అనే అంశాన్ని కూడా ఈ రోజు అఫిడవిట్లో పేర్కొన్నారు.మరోవైపు యూనియన్లు చట్ట విరుద్ధంగా సమ్మెలోకి వెళ్లాయని చెప్పి పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రోజులుగా ఆర్టీసీ కార్మికులను కూడా జీతాల్లేక రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిస్థితి ఉధృక్తి చేస్తున్నారని తెలిపింది. మరి రేపైనా హైకోర్టు ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందేమో చూడాలి.