చిన్నగింజల్లో పెద్ద ప్రయోజనాలు

యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే దినుసుల్లో కొన్ని

వంటింట్లో ఉండే పొపుల డబ్బాను ఔషధాల పెట్టెగా చెప్పవచ్చు. మన పూర్వీకులు ఎంతో అనుభవంతో కొన్ని రకాల గింజలను మన ఆహారంలో భాగంగా చేర్చారు. వాటిలో కొన్నింటి గురించి ...

- నల్లమిరియాలు

వీటినే క్వీన్ ఆఫ్ స్పెషల్ గా పిలుస్తారు. నల్లమిరియాల కి ఆయుర్వేదంలో చాలా విశిష్ట స్థానం ఉంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి పాలల్లో చిటికెడు మిరియాలపొడి వేసుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫం అంతా పోతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. వెల్లుల్లి మిరియాలు కాంబినేషన్ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి. మిరియాల టీ, అల్లం మిరియాల టీ రోజూ తీసుకుంటే అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది.

- జీలకర్ర
జీలకర్ర బెల్లం లేకుండా హిందూ సంప్రదాయంలో పెండ్లి జరగదు.  జీలకర్ర ఆవాలు పోపు లేనిదే చాలామందికి పప్పు అన్నం గొంతు దిగదు. శరీరంలోని ఉష్ణాన్ని తీసేసే శక్తి జీలకర్రకు ఉంది.దీనిలోని పాలీఫినాల్స్ అనే పదార్థం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది

- నట్స్
శరీరానికి ఇమ్యూన్ బూస్టర్ గా నట్స్  పనిచేస్తాయి యాంటీఆక్సిడెంట్ గాను, రోగనిరోధక శక్తి పెంచడంలోనూ గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ గింజలు రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి.

- బాదం పప్పు
ఇంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. బాదం, గసగసాలు రెండు కలిపి పొడిగా చేసి పాలలో కలుపుకుని తాగితే శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది.

- అవిసె గింజలు
గింజల్లో కెల్ల చాలా ప్రత్యేకమైన స్థానం. ఇందులో ఉన్న ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,  ఒమేగా-3 కొవ్వు కరిగించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని ఫైటో ఈస్ట్రోజెన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన గ్రహించే శక్తి ని ఇవి ఇస్తాయి.

ఇవి రోజూ తీసుకుంటే...

శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంతో, రోగనిరోధక శక్తి పెంచడంలో లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, వెల్లుల్లి బాగా పనిచేస్తాయి.

- లవంగాలు
ఇందులో ఉండే ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మెదడు పని తీరును చురుగ్గా చేస్తాయి. అంతేకాదు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతాయి.  వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి,  విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, కఫం, పంటినొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లవంగాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

- దాల్చిన చెక్క
శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క ది కీలక పాత్ర. ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.-  అంతేకాదు శరీరంలోని రక్త కణాలు ఆక్సిజన్ను గ్రహించే శక్తిని కూడా పెంచుతాయి.

-అల్లం
రోజూ అల్లం తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తోంది. రోజూ పరగడుపున అల్లం తేనెతో కలిపి తీసుకోవడం ఎంతో ఉత్తమం. అల్లం తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం.

-వెల్లుల్లి
అల్లము వెల్లుల్లి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమం లేనిదే నాన్ వెజ్ కర్రీలకు రుచి రాదు. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్న వెల్లుల్లి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. గుండె జబ్బులను వెల్లుల్లి నివారిస్తుంది.