140 కి.మీ వేగం, కారులో మద్యం బాటిళ్లు..భరత్ ప్రాణం

ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల దర్యాప్తులో భరత్ తన ప్రాణాన్ని తనే చేజేతులా పొగొట్టుకున్నాడని తెలుస్తోంది. నిన్న రాత్రి నోవాటెల్ నుంచి గచ్చిబౌలిలోని తమ ఇంటికి స్కోడా కారులో బయలుదేరిన భరత్ అత్యంత వేగంగా డ్రైవ్ చేశాడు..ప్రమాదం జరిగిన తర్వాత స్పీడ్ మీటర్ 140 మీటర్ల వద్ద ఆగినట్లు సమాచారం. ఎదురుగా లారీ ఆగివుండటాన్ని పసిగట్టిన భరత్ బలంగా బ్రేకులు వేసినట్లు రోడ్డుపై పడ్డ టైర్‌ మరకలు చూపుతున్నాయి. అయితే కారు అత్యంత వేగంతో ఉండటంతో కంట్రోల్ కాలేదు.. ఇదోక్కటే కాకుండా కారులో వోడ్కా మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే భరత్ మద్యం తాగి డ్రైవ్ చేశారా లేదా అన్నది తెలియాలంటే పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సిందే. ఏదేమైనా అతివేగం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది.