చెరుకురసం తాగితే బరువు తగ్గుతారా!


ఎండాకాలం వస్తోందంటే చాలు... ఎలా దాహం తీర్చుకోవాలా అని శరీరం తపనపడిపోతుంది. అందుకోసం కూల్డ్రింక్స్ తాగుదామంటే.... అవి మన దాహాన్ని పూర్తిగా తీర్చకపోగా లేనిపోని సమస్యలని తెచ్చిపెడుతుంటాయి. వాటి బదులు కాస్త చెరుకురసాన్ని గుటకవేశామంటే దాహం ఎలాగూ తీరుతుంది, దాంతో పాటు కావల్సినంత ఆరోగ్యమూ దక్కుతుంది. ఎలాగంటారా...

 

బరువు తగ్గి తీరతారు:- చెరుకురసంలో కొవ్వు పదార్థాలు కొంచెం కూడా ఉండవు. పైగా ఇందులో ఉండే సహజమైన చక్కెరల వల్ల మన ఒంట్లోని చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. వీటికి తోడు చెరుకురసంలో ఉండే పీచు పదార్థాలు ఒంట్లోని మలినాలను తొలగించడంలో తోడ్పడతాయి.

 

షుగర్ వ్యాధిగ్రస్తులకూ మంచిదే :- షుగర్ వ్యాధి ఉన్నవారు, వస్తుందని భయపడేవారు కాస్త మోతాదులో చెరుకురసాన్ని పుచ్చుకోవచ్చునట! చెరుకురసంలోని glycemic index చాలా తక్కువ. అంటే ఇందులో ఉండే చక్కెర పదార్థాలు మన శరీరానికి ఒక్కసారిగా కాకుండా.... నిదానంగా శక్తిని అందిస్తూ ఉంటాయన్నమాట.

 

పళ్లకి మంచిది:- తీపి పదార్థాలు తినడం వల్ల పళ్లు పాడైపోతాయని చెబుతూ ఉంటారు. చెరుకురసం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంది. చెరుకురసంలో కాల్షియం, ఫాస్పరస్ ఉండటం వల్ల పళ్ల ఎనామిల్కు మరింత గట్టిదనం ఏర్పుడుతుంది. పైగా చెరుకురసంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుందట!

 

మెరిసే చర్మం కోసం :- చెరుకురసంలో Alpha Hydroxy Acids అనే పదార్థాలు ఉంటాయట. వీటి వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుందన్నది నిపుణుల మాట. అంతేనా! చర్మంలో తేమ ఉండాలన్నా, మొటిమలు సమస్య తీరాలన్నా కూడా చెరుకురసం దివ్యౌషధంగా పనిచేస్తుందట.

 

జీర్ణశక్తి కోసం :- చెరుకురసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు, మలబద్ధకం వంటి సమస్యలు తీరిపోయేందుకు ఈ పొటాషియం దోహదపడుతుంది. చెరుకురసంలో ఆమ్లగుణం ఉండటం వల్ల ఒంట్లో జీర్ణరసాలు కూడా ఎక్కువగా స్రవించి... ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.

 

క్యాన్సర్ను సైతం :- చెరుకురసంలో ఆమ్లగుణం ఎక్కువని చెప్పున్నాం కదా! దీంతో పాటుగా ఇనుము, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు మనుగడ సాగించలేవంటున్నారు నిపుణులు.

 

రక్తపోటుకీ ఉపయోగమే :- రక్తపోటు ఉన్నవారి శరీరంలో సోడియం నిల్వలను నియంత్రించడం చాలా అవసరం. చెరుకుసరంలోని అధిక పొటాషియం ఈ పని చేసిపెడుతుంది. ఈ పొటాషియం వల్ల ఒంట్లో అవసరానికి మించి ఉన్న సోడియం అంతా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

- నిర్జర.