సమ్మర్ లో మామిడితో మజా


మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు...

మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి...


ముఖ్య ప్రయోజనాలను చూద్దాం :-

వేసవిలో వడదెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడి రసాన్ని మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. నీరసంతో పాటూ, అలసట కూడా తగ్గుతుంది. వడదెబ్బ సమస్య నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. పచ్చిమామిడి కాయలో విటమిన్  సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. 

ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది.

మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.