జగన్ కేసులో అత్యవసర విచారణ అవసరం లేదు

 

ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ జోక్యం అవసరం లేకుండా తామే విచారణ చేస్తామని పేర్కొంది. కాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కేంద్రం ఈ కేసు విచారణని ఎన్ఐఏకి  అప్పగించటంపై ఏపీ సర్కార్ మెుదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.