నల్గొండలో హమాలీ కార్మికుల మధ్య ఉధృక్తతకు దారీ తీస్తున్న ఘర్షణ...

 

గత కొన్ని రోజులుగా హమాలీ కార్మికుల మధ్య ఘర్షణ జరుగుతోంది. నల్గొండలో హమాలీ కార్మికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకరి పై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ రోడ్ల పై పరుగులు పెట్టారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు హడలిపోయారు. హమాలీ కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.దీంతో ఎవరు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు.

ఇది ఇలా ఉండగా మొన్నటి దాకా సీపీఎం అనుబంధ సంఘం సీఐటీయూ యూనియన్ లో ఉన్న కొందరు ఇటీవల టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు. దీంతో లోడింగ్ అన్ లోడింగ్ విషయంలో కొద్ది రోజులుగా రెండు యూనియన్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ రోడ్ లోని ఒక సిమెంట్ ట్రేడింగ్ షాప్ ముందు టీఆర్ఎస్ కేవీకి చెందిన హమాలీలు అన్ లోడింగ్ చేస్తున్నారు. వీరిని సీఐటీయూకు చెందిన హమాలీలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.

ఒకరి పై ఒకరు దాడికి దిగారు. ఘర్షణలో పలువురు గాయపడ్డారు.ఈ సంఘటనను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.ఈ ఘర్షణ పై పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలానే వదిలేస్తే ఇంకా పరిస్థితులు ఉధృక్తం అవుతాయని వెల్లడిస్తున్నారు అక్కడి ప్రజలు.