హఫీజ్ ఉగ్రవాదే.. ప్రకటించిన పాక్

26/11 ముంబై మారణ హోమానికి కీలక సూత్రధారి జమాత్ ఉద్ దవా సంస్థ అధినేత, లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనిని ఉగ్రవాదిగా గుర్తించాలని.. తమ దర్యాప్తుకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో పాక్‌పై ఒత్తిడి చేస్తోంది. దీనిలో భాగంగా ఐక్యరాజ్యసమితి ముందు ప్రతిపాదన సైతం ఉంచింది. అయితే చైనా తన వీటో పవర్‌తో ఈ తీర్మానం వీగిపోయేలా చేసింది. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వంపై.. దమ్ముంటే తనను ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ హాఫీజ్ సవాల్ విసిరారు. ఇప్పుడు పాక్ ఆ పని చేసి చూపింది. ఇతనిని ఉగ్రవాదిగా పేర్కొంటూ రూపొందిన ఆర్డినెన్స్‌కు అధ్యక్షుడు హుస్సేన్ ఆమోదముద్ర వేశారు.