అమ్మాయిల కోసం పబ్బునే కట్టిన డేరా..?

తన శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా అకృత్యాలు రోజుకోకటి బయటకు వస్తున్నాయి. సిర్సాలోని డేరా కేంద్ర కార్యాలయాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు మరో షాకింగ్ న్యూస్‌ను బయటకు వెల్లడించారు. మన బాబా గారికి అమ్మాయిలంటే మోజు కదా..? శిష్యురాళ్లతో పాటు తన వద్ద ఆశ్రయం పొందుతున్న బాలికలతో పైశాచిక ఆనందాన్ని పొందిన గుర్మీత్‌‌‌‌కు కొత్త అమ్మాయిలు కావాల్సిందే..అందుకోసం ఏకంగా తన డేరా కాంపౌండ్‌లో పబ్‌నే కట్టాడు. తన పెంపుడు కూతురు హనీప్రీత్ సింగ్ ద్వారా సదరు పబ్‌లో రాత్రిపూట పార్టీలను ఏర్పాటు చేయించేవాడట. ఇందులో కేవలం ఉన్నత వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే ప్రవేశం..పార్టీకి వచ్చే వారి నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసేవారు.. స్త్రీలు మాత్రమే ప్రవేశమున్న ఇందులోకి అడుగుపెట్టే పురుషుడు ఒక్క గుర్మీత్ మాత్రమే. ఈ పార్టీలకు ఆకర్షణీయమైన వేషధారణలో వచ్చే గుర్మీత్‌ ద్వంద్వ అర్థాలు వచ్చే డైలాగులు చెబుతూ..పాటలు పాడుతూ మహిళలను ఆకర్షించి, వారితో కలిసి ఆడతాడు. అందులోంచి తనకు నచ్చిన వారిని వలలో వేసుకుని రాత్రికి వారితో గడుపుతాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.