కేంద్రానికి తెలిసొచ్చిందా.. అందుకే ఈ మార్పులా...!

 

ఏదైనా ఒకపని చేయాలనుకున్నప్పుడు...నిర్ణయం తీసుకునేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటాం. అలాంటిది ఒక దేశానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాంటే ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాంటి ముందు చర్యలు తీసుకోకుండా.. నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చినట్టుంది. అందుకే తాము తీసుకున్న నిర్ణయాలపై మరోసారి మార్పులు చేపడుతుంది. గత ఏడాది పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్ల ధనాన్ని అరికట్టేందుకు, నల్ల కుబేరుల తాట తీసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్నా... ఈ నిర్ణయం వల్ల అందరూ బాగానే ఉన్నా సామాన్య ప్రజలు పడిన కష్టాలు మాత్రం దేవుడికే ఎరుక. ఇక దీనివల్ల ఎవరికీ ఒరిగింది ఏం లేదు. 500, 1000 నోట్లను రద్దు చేసి 2 వేల నోటును తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ వెయ్యి నోటును తీసుకొస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని కేంద్ర పెద్దలు అన్నారు.

 

ఇప్పుడు జీఎస్టీ వంతు వచ్చింది. జీఎస్టీ అమలుపై ఇప్పటికీ కొంత వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఈ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజల నెత్తిన భారం ఇంకా పడిందనే చెప్పొచ్చు. అందుకే మరోసారి మార్పులు చేసింది జీఎస్టీ కౌన్సిల్. జీఎస్టీ లో 28 శాతం, 18  శాతం, 12 శాతం, 5 శాతం అని ఇలా నాలుగు విభాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే కదా. ఈ పర్సెటేజ్ లను బట్టి వస్తువులను విభజించారు. అయితే ఇప్పుడు కామన్ మెన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసింది జీఎస్టీ కౌన్సిల్. గరిష్ట టాక్స్ రేట్ అయిన 28 శాతంలో 2 వందలకు పైగా వస్తువులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 50 కి తగ్గించింది. 28 శాతంలో ఉన్న 178 వస్తువులను 18 శాతం శ్లాబ్ లోకి మార్చింది. 13 రకాల వస్తువులపై పన్ను 18 నుంచి 12శాతానికి, ఆరు వస్తువులపై 12 నుంచి 5 శాతానికి, ఆరు వస్తువులపై 5 నుంచి సున్నా శాతానికి టాక్స్ తగ్గించారు. రెస్టారెంట్ల బాదుడుకు బ్రేకులేశారు. గతంలో ఉన్న 28, 18 శాతం ట్యాక్స్ రేటును 5 శాతానికి తగ్గించారు. దీంతో ఫుడ్ రేట్లు భారీగా తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి. మరి అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు.. మళ్లీ వాటిల్లో మార్పులు చేర్పులు తీసుకురావడం ఎందుకు..?నిజానికి జీఎస్టీ అమలై ఎన్నో రోజులు గడిపోయినా... కొంత మందికి ఇప్పటికీ జీఎస్టీ గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మళ్లీ ఈ మార్పులు.. మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు .. మార్పుల చేయడం ఎందుకు.. ఏది ఏమైనా మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి కామెన్ మెన్ పవర్ ఏంటో అర్ధమయినట్టుంది.