గ్రామ పంచాయితీ ఎన్నికలు జూన్ లో ...

Gram Panchayat Elections June, June Gram Panchayat Elections, Gram Panchayat Andhra Pradesh Elections June

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బుధవారం రాత్రి మంత్రులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి వ్యాహాన్ని రూపొందించారు. మేలో జరగాల్సిన గ్రామపంచాయితీ ఎన్నికలను జూన్ నెలలో జరిపించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏప్రిల్, మే రెండునెలలు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని కూడా నిర్ణయించారు. జగజ్జీవన్ రాం జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకు అంటే ఏప్రిల్ 5 నుండి 14 వరకు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్ధత కల్పించిన అంశంపై ప్రచారం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్రభారతిలో పేదలకు సబ్సీడీ ధరలకు వివిధ నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అలాగే మండల కేంద్రాల్లో ఏప్రిల్ 15 నుంచి మండల కేంద్రాల్లో ప్రారంభిస్తారు. రైతు చైతన్య యాత్రలను ఏప్రిల్ 21 నుండి మే 8 వరకు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో రైతు సదస్సులు మే10 నుండి 15 వరకు, ఏప్రిల్ 25 నుండి 10 వరకు స్థాయీ సంఘాల సమావేశాలు జరపాలని నిర్ణయించారు. జూన్ లో గ్రామ పంచాయితీల ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయితీల ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు.