చంద్రబాబు వెనుక ఇంత రాజకీయ కుట్ర చేశారా గవర్నర్ జీ...!

 

ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగానే నాలుగేళ్లు కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ కుట్ర వెలుగుచూసింది. అది రాజభవన్ సాక్షిగా జరిగిన రాజకీయ కుట్ర అని ఏపీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఈ కుట్రకి కథ, స్క్రీప్లే, దర్శకత్వం ఎవరనుకుంటున్నారా...? ఆయనెవరో కాదు... ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది.. కదా... అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

 

నరసింహన్ ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ సపోర్ట్ చేస్తారని.. తెలంగాణకే ఎక్కువ వంతపాడుతారన్నది ఏపీ నేతల అబిప్రాయం. అంతేకాదు ఇటీవల ఆయన్ని మార్చాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే...ఏపీకి, కేంద్రానికి మధ్య విభేధాలు పెరగడానికి గవర్నరే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడానికి కారణం నరసింహనే అన్న వార్త వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారట నరసింహన్. అంతేకాదు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా.. గవర్నర్ ఇందులో ఏదో మతలబు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేశారట. ఇక ఇదంతా గమనించిన ఓ కేంద్ర మంత్రి చంద్రబాబు అంటే గవర్నర్ నరిసంహన్ కు పడదా? అని పలువురు నేతల వద్ద అన్నారట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...గవర్నర్ చెప్పిన మాటలు, ఇస్తున్న నివేదికలను నమ్మే ఇన్ని రోజులు ప్రధాని మోడీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. అందుకే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటున్నా..బీజేపీ ఒక్కమాట కూడా మాటలడలేదట.

 

అంతేకాదు వైసీపీ అధినేత జగన్ కు, జనసేన అధినేత మద్య సఖ్యత ఏర్పడానికి కూడా గవర్నరే కారణమట. ఏపీలో ప్రస్తుతం జగన్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని.... ఈ టైంలో పవన్ కనుక చంద్రబాబుకి ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారని చెప్పారట. దీనికి కేంద్రం సిగ్నల్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన గవర్నర్... పవన్ ను పిలిపించుకొని మాట్లాడారట. ఐ.వై.ఆర్ కృష్ణారావు వంటివారితో సంప్రదింపులు జరిపారట. దీనిలో భాగంగానే వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని..  అందుకే మోడీ ఎప్పుడు అడిగితే అప్పుడు విజయసాయిరెడ్డికి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని... పవన్ ను బీజేపీ నడిపిస్తుందని.. ఇలా పలు వార్తలు వింటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు గవర్నర్ చేసిన పనికి టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టీడీపీని బలహీన పరిచేందుకే కేంద్రానికి గవర్నర్ తప్పుడు నివేదికలు అందజేశారని... తన పదవిని కాపాడుకునేందుకు గవర్నర్ బీజేపీ తొత్తుగా మారారని విమర్శిస్తున్నారు. మొత్తానికి సైలెంట్ గా ఉండే గవర్నర్ ఇంత డ్రామా నడిపారంటే గ్రేట్ అంటున్నారు కొంతమంది. పూజలు పునస్కారాలు అంటూ ఎప్పుడూ గుళ్ల చుట్టూ తిరిగే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ లో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.