ఒకపక్క క్యాండీక్రష్.... మరోపక్క ఆపరేషన్..


 

ఇటీవల ఒకతను మ్యూజిక్ వింటూ ఆపరేషన్ చేయించున్న వార్త విన్నాం. ఇప్పుడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ చిన్నారి క్యాండీక్రష్ ఆడుకుంటూ ఆపరేషన్ చేయించుకుంది. ఈ ఆశ్చర్యమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలో నందిని అనే చిన్నారి ఐదో తరగతి చదువుతుంది. అయితే నందిని ఒకరోజు ఆకస్మాత్తుగా కిందపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన వైద్యులు.. పాప మెదడులో ఖణితి ఉందని.. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే ఈ ఆపరేషన్ అందరికీ చేసినట్టు చేయడం కుదరదు... ఆపరేషన్ చేసేప్పుడు పాప మెలకువతో ఉండాలి... పొరపాటున వేరే నాడికి దెబ్బతగిలితే చిన్నారి ఎడమ భాగమంతా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. ముందు దీనికి భయపడిన తల్లిదండ్రులు.. పాప మామయ్య డాక్టర్ కావడంతో అతని సమక్షంలో ఆపరేషన్ కు ఒప్పుకున్నారు. వైద్యులు కణితిని తొలగించేటప్పుడు తాను థియేటర్‌లోనే ఉన్నాననీ, అప్పుడు నందిని తన సెల్‌ఫోన్‌లో క్యాండీక్రష్‌ ఆడుకుందని నందిని మామయ్య తెలిపారు. వైద్యులు అడిగినప్పుడల్లా తన కాళ్లూ, చేతుల్ని కదిలించిందనీ, ఇతరత్రా భాగాలపై ప్రభావం పడకుండా నిర్దేశిత భాగంలోనే వైద్యులు శస్త్రచికిత్స జరిపారని చెప్పారు.