గజల్ శ్రీనివాస్ కు మరో షాక్..

 

గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. ఆల‌య‌వాణి రేడియోలో పనిచేస్తున్న కుమారి అనే ఓ మహిళ.. గజల్ శ్రీనివాస్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆయనను అరెస్ట్ చేశారు. అంతేకాదు..బాధితురాలు... సమర్పించిన టేపులు, వీడియో క్లిప్పింగులపై దర్యాప్తు చేపట్టామని... గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఇక నాంప‌ల్లి కోర్టు ఈ నెల 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక ఆయనకు బెయిల్ కూడా రాలేదు. ఇప్పుడు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. సేవ్ టెంపుల్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న... ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ ఆల‌య అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. సేవ్ టెంపుల్ అధ్య‌క్షుడు వెల‌గ‌పూడి ప్ర‌కాశ్‌రావు ఈ విష‌యంపై మాట్లాడుతూ... త‌మ‌ సంస్థ‌ల్లో ప‌నిచేసే స్త్రీల‌ను దేవ‌త‌ల్లా గౌర‌విస్తామ‌ని అన్నారు. సంస్థ పేరు అడ్డం పెట్టుకుని ఇటువంటి వికృత కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే స‌హించ‌బోమ‌ని తెలిపారు. తమ సంస్థ హైందవ ధర్మం కోసం పనిచేస్తోందని, ఇటువంటి ఘటన జరగడం విచారకరమని అన్నారు.