గజల్ అరెస్ట్.. బెయిల్ కూడా లేదు... అది నిజమే..

 

లైంగిక వేధింపుల ఆరోపణలతో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. కుమారి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఈరోజు పోలీసులు ఆయ‌న‌ను నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు ఈ నెల 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కానీ బెయిల్ రాలేదు. దీంతో ఆయన్ని జైలుకు తరలించారు.

 

గజల్‌ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్ట్టామని...గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. టేపులు, వీడియో క్లిప్పింగుల ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలిపారు.