గజల్ శ్రీనివాస్ అరెస్ట్.. నాకేం తెలియదు..


ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వార్త సంచలనం రేపుతోంది. వివరాల ప్రకారం.... కుమారి అనే మహిళ పంజాగుట్టలోని ఆలయవాణి వెబ్ రేడియోలో పని చేస్తుంది. ఈ ఆలయవాణి వెబ్ రేడియో కూడా గజల్ శ్రీనివాస్‌దే. ఈమె... గజల్ శ్రీనివాస్ మీద ఆరోపణలు చేశారు. గజల్ శ్రీనివాస్ తన పై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు కుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. గజల్ శ్రీనివాస్ కి అనుకూలంగా పార్వతి అనే మరో రేడియో జాకీ మద్దతు తెలిపారు. తానకు చిన్నప్పటి నుండి శ్రీనివాస్ తెలుసని... ఆయన మీద ఫిర్యాదు చేసిన కుమారి అసలు పేరు అరుణ అని..  గజల్ శ్రీనివాస్ కి భుజం నొప్పి వచ్చినప్పుడు ఆమె చొరవ తీసుకుని మసాజ్ చేయడం తాను దగ్గరుండి చూసినట్టు పార్వతి తెలిపారు. ఇక ఎప్పటినుంచో తెలిసిన గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించడం చూడలేదన్నారు.

 

ఇక తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన గజల్ శ్రీనివాస్ ఆమె తనకు బిడ్డ లాంటిదని, ఆమెతో మసాజ్ చేయించుకోలేదని వివరణ ఇచ్చాడు. త‌న‌పై ఆమె ఎందుకు ఆరోప‌ణ‌లు చేసిందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఆమెతో తాను మసాజ్ చేయించుకోలేదని, ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తన భుజానికి దెబ్బ తగిలిందని, ఒక రోజు ఫిజీషియన్‌ రాకపోయేసరికి ఆ యువతి మసాజ్‌ చేస్తానని చెప్పిందన్నారు. తాను వద్దంటున్నప్పటికీ ఆమే తన భుజానికి మందు రాసిందని తెలిపారు. అంతేగాని తాను చెడుగా ప్రవర్తించలేదని చేయించుకోలేదని చెప్పారు.