హాస్పిటల్ లో జార్జ్ బుష్..


అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనను హూస్ట‌న్‌లో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... బుష్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు. మ‌రో రెండు రోజుల్లో అత‌ను ఇంటికి వెళ్లే అవ‌కాశాలున్న‌ట్లు చెప్పారు. కాగా జార్జ్ బుష్ 1989 నుంచి 1993 వ‌ర‌కు అమెరికా దేశాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.