తెలంగాణలో రాహుల్ సభలకు గద్దర్ సపోర్ట్

 

తెరాస భహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించినది విదితమే.కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కూడా  ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమైంది.ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భైంసా, కామారెడ్డిలలో జరిగే రెండు బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసగించనున్నారు.అనంతరం హైదరాబాద్‌లో జరిగే రాజీవ్‌ సద్భావనా యాత్రలోనూ పాల్గొననున్నారు.సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. రాహుల్‌ పర్యటన ముగిసిన వెంటనే పీసీసీ ప్రచార కమిటీ ప్రచారాన్ని కొనసాగించనుంది.ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నట్లు గద్దర్ తెలిపారు.

'దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో మరో జాతీయ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన రాహుల్‌ గాంధీకి స్వాగతం.భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో రాహుల్‌ సభలను విజయవంతం చేయండని విజ్ఞప్తి చేస్తున్నా' అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.ఇటీవల గద్దర్ ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోనూ చేరబోననని స్పష్టం చేశారు.త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందని గద్దర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.