భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ

 

ప్రస్తుత ప్రధానమంత్రి పదవి కాలం పూర్తి కాలేదు, ఎన్నికలకేమో ఇంకా ఏడాది సమయం ఉంది.. మరి అప్పుడే భవిష్యత్తు ప్రధాని రాహుల్ అని ఎలా తెలిసింది అంటారా.. సామాన్యులం మనకి తెలియకపోవొచ్చు కానీ నాయకులు ముందే ఊహిస్తారుగా.. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ ప్రధాని అని ముందే ఊహించారన్నమాట.. మహాత్మా గాంధీ హత్యలో ఆరెస్సెస్ కు సంబంధాలు ఉన్నాయని రాహుల్ చేసిన ఆరోపణలకు గాను ఆరెస్సెస్ కేసు వేయటం.. రాహుల్ నిన్న ముంబైలోని భీవండి కోర్ట్ కు హాజరవడం తెలిసిందే.. మరి కాంగ్రెస్ నాయకులు ఆగుతారా.. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ చవాన్ మరియు కొందరు నేతలు.. 'భవిష్యత్తు ప్రధాని రాహుల్' కి స్వాగతం అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు.. బీజేపీ మీద ఇప్పుడిప్పుడే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం మానేసి ఇలా భవిష్యత్తు ప్రధాని రాహుల్ అంటూ ఫ్లెక్సీలు పెడితే ఏమోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.