అతని క్యాబినెట్లో సగంమంది మహిళలే మంత్రులు...

 

ఇమ్మాన్యువ‌ల్ మాక్రాన్ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇమ్మాన్యువ‌ల్ తన క్యాబినెట్ సిద్దం చేశారు. దాదాపు అన్ని వర్గాల వారికి తన క్యాబినెట్ లో స్థానం కల్పించారు ఇమ్మాన్యువ‌ల్. ముఖ్యంగా ఆడవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. సగం మంది పురుషులను, సగం మంది మహిళలను తన ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించే మంత్రులుగా స్వీకరించారు. మొత్తం 22మంది మంత్రులతో కేబినెట్‌ను సిద్ధం చేసుకున్నా మెక్రాన్‌ అందులో 11 మంత్రి పదవులు మహిళలకే ఇచ్చారు. అత్యంత కీల‌క‌మైన మంత్రి ప‌దవుల‌ను ఆడ‌వాళ్ల‌కే క‌ట్ట‌బెట్టారు. ర‌క్ష‌ణ, కార్మిక, క్రీడా శాఖ‌ల‌కు మ‌హిళ‌ల‌నే మంత్రులుగా చేశారు.