కోడెల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్.. రెండు వారాల కిందటే?

 

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వరుస ఆరోపణలు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కొద్దిరోజులు క్రితం కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. రెండు వారాల కిందట కూడా కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారట. సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో అప్పట్లో ముప్పు తప్పిందని తెలుస్తోంది.