మీ వయస్సు 30 ఏండ్లు దాటిందా.. అయితే వీటికి దూరంగా ఉండండి

శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం
ఆయా వయసులను బట్టి ఉంటుంది. మనిషి జీవితంలో వివిధ దశల్లో ఆహారం మారుతూ ఉంటుంది. పాపాయిగా ఉన్నప్పుడు ఆరునెలల వరకు అమ్మ పాలే ఆహారం. ఆ తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో అలా అలా జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకుంటాం. అయితే యుక్తవయసులో బండలు తిన్నా కరిగించుకునే శక్తి ఉంటుంది అంటారు.కానీ, మూడు పదులు దాటిన తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఎంటో చూద్దాం..

1. మీగడ పెరుగు :

మీగడ పెరుగు, పండ్లను కలిపి తినాలని మీరు అనుకుంటే వాటిని వేరువేరుగానే తినడం మంచిది. షాపుల్లో  రుచికరమైన పెరుగును కొని ఆరోగ్యకరమైన వాటిని తింటున్నామని మీరు అనుకోవచ్చు కానీ అది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. వీటిలో తరచుగా చక్కెర కలిసి ఉంటుంది. 30 ఏండ్లు నిండిన వాళ్ళు  ఇటువంటి వాటికి  దూరంగా ఉంటేనే మంచిది.

2. సోడా.

సోడాలో అధిక మోతాదులో ఫ్రాక్టోల్ కార్న్ సిరఫ్ ఉంటుంది.  ఇది మనుషులు తీసుకునే అతి అనారోగ్యకరమైన పదార్థాల్లో ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైంది కూడా. ఇది డైరెక్టుగా లివర్ లోకి చేరుకొని అక్కడే క్రొవ్వు రూపంలో పేరుకుపోయి ఉండటమే కాకుండా ఆకలిని తగించే హార్మోన్ లెఫ్టిన్ నిరోధానికి కూడా కారణం అవుతుంది. మనుషుల శరీరంలో క్రొవ్వు పెరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం.

3. కృత్రిమ తీపి పదార్థాలు

చెక్కరను తగ్గించి వాటిని బదులుగా కృత్రిమ తీపి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని మీరు అనుకోవచ్చు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. వాస్తవానికి అటువంటి వాటిని కేవలం రుచి కాపాడేందుకే కలుపుతూ ఉంటారు. అది ఒకరకంగా చెక్కరను తీసుకోవడం కన్నా అతి ప్రమాదకరం. కృత్రిమ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని  అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనిని నిర్ధారించడానికి ఇంకా పరిశోధన కొనసాగుతూనే ఉంది.

4. బీర్

ఇది మనుషులు తీసుకున్నే అనారోగ్యకరమైన  మద్యంలో ఒకటి. దీన్ని పులియబెట్టిన ధాన్యాల ద్వారా తయారు చేస్తారు. అంటే ఒకరకంగా ఫంగస్ ను కలిగి ఉంటుంది. ముదురు బీర్ లో ఇంకా ఎక్కువ మోతాదులో ఆకుపచ్చని బూజు ఉంటుంది. ఇది కాకుండా, తాగేవారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచే కొన్ని కార్బోహైడ్రేట్లు ఇందులో ఉంటాయి.

5. నిల్వచేసిన సూప్ లు

నిల్వచేసి ఉంచబడినది సూప్‌లు లేదా తయారుచేయబడి ఉన్న ఏ సూప్ లు ఆరోగ్యానికి మంచివి కావు. తయారుచేయబడిన సూప్‌లో చాలా ఎక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. ఎందుకంటే వాటిని సంరక్షించే ఏకైక మార్గం అదే కాబట్టి. ఆ ద్రవ పదార్థాలను సంరక్షించేందు కోసం సోడియం మాత్రమే కాకుండా చక్కెరను కూడా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.  కాబట్టి రెడీ టూ  ఈట్ , రెడీ టూ డ్రింగ్ సూప్ లను తీసుకోవద్దని డాక్టర్లు  సూచిస్తున్నారు.

6. మైదా పిండి :

మైదా పిండి ఆరోగ్యకరమైనదే అనుకుంటారు. దాని వినియోగం చాలా సాధారణం అయిపోయింది.  ప్రతి ఒక్కరూ దీనిని వినియోగిస్తున్నారు. 30 ఏండ్ల వయసు తర్వాత దీన్ని ఉపయోగించడం మానేయాలి. ఇది వృద్ధాప్యా లక్షణాలు తర్వతగా కనిపించే  రసాయన ఏజెంట్‌గా పనిచేస్తుంది.  కాబట్టి  వృధ్యాప్యాన్ని
కొనితెచ్చుకోకూడదు అనుకునే వాళ్ళు  30 ఏండ్లు దాటాక దీన్ని మానివేయడం మంచిది.

7. సొయా

ఇది జన్యుపరంగా చాలా మార్పులు చేయబడింది. ఇది థైరాయిడ్ అసమతుల్యకు దారితీసేందుకు దోహదపడటమే కాకుండా ఇది శరీరంలో మంటను పెంచుతుంది. ఈ సోయాలో మొక్కల ఆధారిత ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉన్నాయని సెంటర్ స్టేట్ కు చెందిన డాక్టర్ ప్రూడెన్స్  హాల్ బృందం నిర్ధారించారు. అది శరీరంలోకి ప్రవేశించి థైరాయిడ్ పెంచేందుకు దారి తీస్తుంది. ఒక వేళ మీరు ఇప్పటికీ థైరాయిడ్
సమస్యను ఎదుర్కొంటుంటే వీటిని తీసుకోవడం మానేస్తేనే మంచిది.

8. ప్రాసెస్డ్ మీట్

శుద్దిచేసిన మాంసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం ప్రమాదకరం. ఇలా ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక మోతాదులో సోడియం, క్రొవ్వు ఉంటుంది. ఇది రుచికరంగా బాగుంటుందని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే  హైపర్ టెన్షన్ కు గురికావడమే కాకుండా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇతర సమస్యలతో పాటు గుండెకు కూడా ప్రమాదకరం.

9. బాగెల్స్

రుచికరమైన బాగెల్స్  తినడాన్ని ఎవరు ఆపలేరు. అది రుచిపరంగా బాగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో సుమారుగా 250 కాలరీలు ఉన్నప్పటికీ పోషకాలు, పీచుపదార్థాలు ఉండవు. గోధుమ పిండితో తయారు చేసిన బాగెల్ తీసుకుంటున్నప్పటికీ అందులో  575 మి.గ్రా సోడియం  కలిసి ఉంటుంది. అది ఒక రకంగా రోజంతా తీసుకోవాల్సిన ఉప్పును కేవలం ఒక్క స్నాక్ లో తీసుకుంటున్నారని అర్థం.

సో, మీరు మూడు పదుల వయసు దాటిన వారైతే మీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.. జివ్వ రుచి కన్నా జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అన్న విషయం గుర్తుంచుకోవాలి.