సీమాంద్రలో రాజీనామాలు షురూ

 

తెలంగాణ పై తేల్చేసిన కాంగ్రెస్ పై సొంతం పార్టీ నాయ‌కులే భ‌గ్గుమంటున్నారు. తమ అభిప్రాయాల‌కు ఏ మాత్రం విలువ నివ్వకుండా ఏక‌ప‌క్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకున్న అధిష్టానంపై సీమాంద్ర నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. ఈ సంప్రదింపుల‌కు ముందే రాజీనామ చేసిన వీర‌శివారెడ్డి సీమాంద్రలో హీరో కాగా ఇప్పుడు మ‌రింత మంది నేత‌లు అదే బాట‌లో న‌డ‌వ‌నున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న తుల‌సిరెడ్డి త‌ను అధ్యక్షునిగా ఉన్న 20 సూత్రాల ప్రణాలిక క‌మిటీకి రాజీనామ చేశారు. ఆయ‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తూ ఎమ్మేల్యేలు స‌తీష్‌కుమార్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, తోట త్రిమూర్తులు రాజీనామ చేశారు. వీరితో పాటు ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా రాజీనామ‌కు సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే సీమాంద్ర జేఎసి బంద్‌కు పిలుపు నివ్వగా ఆ బంద్‌ను 72 గంట‌ల పాటు కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. దీనికి తోడు స‌మైక్యాంద్ర జేఎసి విద్యార్దులు ఆమ‌ర‌ణ నిర‌హార దీక్షకు కూడా దిగారు. అయితే రేపు స‌మావేశం కానున్న సీమాంద్ర నాయ‌కులు మూకుమ్మడి రాజీనామాల‌కు రెడీ అవుతున్నట్టుగా స‌మాచారం.