చైనాలో భారీ అగ్నిప్రమాదం

చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాన్‌చాంగ్ నగరంలోని హెచ్‌ఎన్ఏ మిక్స్ లగ్జరీ హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు పక్క భవనాలకు కూడా వ్యాపిస్తుండటంతో అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు.