కోర్టుల జోక్యంపై శివసేన అభ్యంతరం
posted on Mar 16, 2015 12:43PM

ముంబైలోని బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మండపాలను, ఉత్సవాలను నిషేదిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై శివసేన విమర్శలు చేసింది. మతపరమైన నమ్మకాలకు సంబంధించిన అంశాలలో కోర్టు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదని శివసేన కోర్టులకు సలహా ఇచ్చింది. ఇలా నిషేదించడం వల్ల హిందూ పండగల సంస్కృతి నాశనమవుతుందని, ఏదో ఒక స్వచ్చంద సంస్ధ అభిప్రాయాన్ని మొత్తం ప్రజల అభిప్రాయంగా కోర్టు ఎలా పరిగణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఉత్సవాలు, పండుగలు లేనప్పుడు కూడా దేశవ్యాప్తంగా వచ్చే పోయే జనాలతో ముంబై నగరం చాలా రద్దీగా ఉంటుందని, ఈ వలసలను కోర్టులు కట్టడి చేయగలవా అని ప్రశ్నించింది. పండుగలను, ఉత్సవాలను నిషేదించడం అంటే ప్రజల్లోని స్పూర్తిని చంపేయడమే అని శివసేన అభిప్రాయపడింది.