మా బాబు గారింటికి వెళ్లకుండా ఆపుతున్నారు.. యూజెలెస్ ఫెలోస్ అంటూ అచ్చం నాయుడు ఫైర్

 

టీడీపీ చలో ఆత్మకూరు పిలుపు తో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యం లో పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఐతే మాజీ మంత్రి అచ్చంనాయుడు పోలీసుల కళ్ళు గప్పి  టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికే చేరుకునే ప్రయత్నం చేశారు. ఐతే చంద్రబాబు నివాసం వద్ద బ్యారికేడ్లు అడ్డుగా పెట్టి కాపలా ఉన్న పోలీసులు అడ్డుకోవడం తో  వారితో వాగ్యుద్ధానికి దిగారు.  "మా బాబు గారింటికి వెళ్లకుండా ఆపడానికి మీకు ఎవరిచ్చారు హక్కు. మా దగ్గర ఆయుధాలున్నాయా. వెనుక అల్లరి మూకలున్నారా . ఎందుకు ఆపుతున్నారు... మీకు పొలిసు ట్రైనింగ్ ఎవరిచ్చారు..  యూజెలెస్ ఫెల్లోస్"  అంటూ పోలీసుల పై ఫెయిర్ అయ్యారు మాజీ మంత్రి అచ్చంనాయుడు.  తరువాత ఆయనను అక్కడి నుండి  అరెస్ట్  చేసి వేరే చోటికి తరలించారు.