ఒకప్పటి శారదాదేశమే కాశ్మీర్.... కశ్మీర్‌ పండిట్లు ఏమయ్యారు ?

 


భారత దేశ భూతల స్వర్గంగా జమ్మూ కశ్మీర్ ను పిలుస్తారు. ఎంతో అందమైన పేరుతో పిలుచుకునే కశ్మీర్ కు చాలా చరిత్రే ఉంది. కశ్మీర్ అసలు మూల నామము శారదాదేశము. ఎంతో హిందూ సంస్కృతితో విరాజిల్లే కశ్మీర్ కు చిట్టచివరి రాజు కూడా మహారాజా హరిసింగ్. ఆయన కూడా హిందువే అందుకే అతడు దేశ విభజన జరిగినప్పుడు కశ్మీర్ ను భారత్ లో విలీనం చేశారు, ఓకవేళ అ రాజు ముస్లిం అయ్యుంటే ఆయన దానిని పాకిస్తాన్ లో కలిపి ఉండేవాదేమో ? విచిత్రం ఏంటంటే ఏడు దశాబ్దాలు పాటు మనదేశంలోనే ఉంటూ ఎంతో స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న కశ్మీర్ నిన్న శ్రవాణ మాసం శుద్ధ పంచమీ, కశ్యప మహర్షి జయంతి రోజే ఆ ప్రతిపత్తి కోల్పోయింది. 

కశ్యప మహర్షి పేరుమీదుగా ఈ కశ్మీర్ ఏర్పడిందని చెబుతారు, నిన్న ఆయన జయంతి రోజున కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోవడం అనేది యాదృచ్చికమే.  ఇప్పటకీ కశ్మీర్ లోని అనేక నగరాలు ప్రదేశాల పేర్లు మన హిందూ పురాణాలను బేస్ చేసుకునే ఉంటాయని అంటూ ఉంటారు. అందులో కొన్నిటిని చూస్తే వరాహమూల అనే పట్టణం బారాముల్లాగా రూపాంతరం చెందింది. అలాగే జంబూదేశమనే పేరే  జమ్ముగా రూపాంతరం చెందింది. ఇక కర్ణరాజ పురం అనే పేరు పీర్ పంజల్ గా, సూర్య పుర అనే పేరు సోపుర్ గా, అవంతీపురమనే పేరు పుల్వామాగా, జయపురమనే పేరు సంబల్ పూర్ గా మారాయి. 

భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరు ప్రపంచంలోనే ఎక్కడాలేని ప్రత్యేకతను కలిగి ఉంది. ఎత్తయిన కొండలు కోనలు నదులు అడవులు, మంచు పర్వతాలు కశ్మీర్ సొంతం. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిపోయిన కశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఇప్పుడు నిజమైన భూతల స్వర్గంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు. కశ్మీరీ పండిట్ల సమాజం ముఖ్యంగా మూడు వర్గాలు. 

వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బన్మాసీల గురించి. కశ్మీర్‌ లోయ ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పుడు వీరంతా వ్యాలీని వదిలేసి వెళ్లిపోయి కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఇక రెండో కేటగిరీ మల్మాసీ. లోయలో జరుగుతున్న అన్ని కష్టనష్టాలను తట్టుకొని అక్కడే స్థిరపడ్డారు. మూడో కేటగిరీ బుహ్రీస్‌. వ్యాపార వ్యవహరాలు సాగించే పండిట్లంతా ఈ కేటగిరీ వారే. అయితే 1989లో పండిట్ల భారీ వలసలతో వీరి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయి. 1846 నుంచి 1947 వరకు డోగ్రా రాజవంశ పాలనలో ముస్లింల సంఖ్య మెజారిటీగానే ఉన్నప్పటికీ కశ్మీరీ పండిట్ల హవా సాగింది. 

ఈ కాలంలో లోయలో అధికంగా ఉన్న ముస్లింలతో సఖ్యతగానే ఉంటూ పండిట్లు జీవనం సాగించారు. అయితే 1950 భూ సంస్కరణ నిర్ణయాల ఫలితంగా 20 శాతం పండిట్లు కశ్మీర్‌ లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1981 నాటికి లోయలో పండిట్ల జనాభా కేవలం 5 శాతం. కొన్ని ఆధారాల కథనాల ప్రకారం 1990లో సుమారు 1,40,000 మంది పండిట్ల జనాభా ఉందని అంచనా వేయగా వారిలో లక్ష మంది కశ్మీర్‌ను వదిలేశారు. వలస వెళ్లిన వారిలో అధికంగా జమ్మూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు.