ఏపీలో ఎవరికెన్ని సీట్లో తేల్చిన సర్వే

 

ఎన్నికలు ఏవైనా ఈమధ్య సర్వే చేయడం కామన్ అయిపోయింది.. ప్రజలు కూడా సర్వేల మీద ఆసక్తి కనబరుస్తున్నారు.. అసలే ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. ఒకవైపు అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి.. మరోవైపు జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతా అంటుంది.. బీజేపీ ఏపీ లో పాగా వేస్తాం అంటుంది.. మరి ఇలాంటి సమయంలో ఏపీలో సర్వే చేస్తే ఎలా ఉంటుంది?.. అందునా లగడపాటి టీంతో..సర్వేల్లో లగడపాటి & టీంకి మంచి పేరుంది.. వీరి సర్వే ఫలితాలు, ఎన్నికల ఫలితాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.. అందుకే లగడపాటిని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు..

అలాంటి లగడపాటి టీంతో ఒక తెలుగు న్యూస్ ఛానల్ సర్వే చేయించింది.. అందుకే ఈ సర్వే మీద అందరూ అంత ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఈ సర్వే ఏం తేల్చింది?.. అధికారం పక్షం టీడీపీకి మరోసారి అధికారం దక్కనుందా? లేక విపక్షాల ఆశ నెరవేరనుందా?.. కచ్చితంగా టీడీపీదే మళ్ళీ అధికారమని ఈ సర్వే తేల్చేసింది.. టీడీపీ 44 శాతం ఓట్లతో 110 స్థానాలు గెలుచుకుంటుందట.. ఇక ప్రతిపక్షం వైసీపీ 37 శాతం ఓట్లతో 60 స్థానాలు గెలుచుకొని మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందట.. అలానే జనసేన సుమారు 9 శాతం ఓట్లతో అక్కడక్కడా ప్రభావం చూపినా, చాలా తక్కువ స్థానాలే గెలుచుకునే అవకాశం ఉందట.. ఇక ఏపీలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, ఒక్క శాతం ఓట్లకే పరిమితం అవుతుందట.. మొత్తానికి ఈ సర్వేతో ఏపీలో మళ్ళీ టీడీపీదే అధికారమని తేలిపోయింది.