టీ తాగే ముందు మంచినీళ్లు తాగాల్సిందే.. ఎందుకంటే...

 

చాలామందికి టీ, కాఫీలు తాగేముందు మంచినీళ్లు తాగడం అలవాటు. ఒకవేళ ఇంటికి వచ్చినవాళ్లకి టీ, కాఫీలు ఇస్తే, వాళ్లు అడిగి మరీ మంచినీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా తాగడం మంచిది కాదన్నది కొంతమంది నమ్మకం. నీళ్లు తాగిన వెంటనే వేడి వేడి టీ తాగడం వల్ల... నాలుక, పళ్లు పాడైపోతాయని వాదన. ఈ మాటలో నిజం ఎంత!

- టీ, కాఫీలలో ఎసిడిటీ ఎక్కువగానే ఉంటుంది. ఎసిడిటీని pH valueతో కొలుస్తారు. అందులో టీ, కాఫీ, పాలు అన్నీ pH 5 నుంచి 7 పాయింట్ల మధ్య స్కోర్‌ చేస్తాయి. ఇంత ఎసిడిసీ ఉన్న టీ, కాఫీలను తాగడం వల్ల పళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు! ఈ ఎసిడిటీ గొంతు, కడుపులో కూడా లేనిపోని సమస్యలని సృష్టిస్తుంది. అది గ్యాస్, అల్సర్స్‌లాంటి సమస్యలకి దారి తీయవచ్చు. నీళ్లు తాగాక టీ తాగడం వల్ల ఈ ఎసిడిటీ dilute అయిపోయి ఎలాంటి side effects ఉండవు.

- మన నోటి దగ్గర నుంచి కడుపు దాకా ఉన్న భాగాలని Aero Digestive System అని పిలుస్తారు. వేడి వేడి టీ ఈ Aero Digestive System లోంచి వెళ్లేటప్పుడు, వీటి మీద ఉన్న సున్నితమైన పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. టీకి ముందు మంచినీరు తాగితే ఈ ప్రమాదం ఉండదట. కేవలం టీ అనే కాదు ఏ పదార్థం తీసుకునే ముందైనా గొంతు కాస్త తడుపుకుంటే అది Aero Digestive Systemకి lubrication లాగా పనిచేస్తుంది.

- వేడి వేడి టీ ఒకేసారి నాలుక మీద పడటం వల్ల, నాలుక మీద ఉండే సున్నితమైన taste buds దెబ్బతింటాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల, నాలుకకి అంత వేడి అనిపించదు.

- టీ డికాషన్‌ ఒక natural colour లాగా పనిచేస్తుంది. అందుకే కొన్ని hair dyes లో టీ పొడిని కూడా ఉపయోగిస్తారు. అలాంటి టీ నేరుగా పళ్లకి తగలడం వల్ల, క్రమంగా పళ్లు పసుపురంగులోకి మారిపోతాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల పళ్ల మీద ఒక protective layer ఏర్పడి, అవి రంగు మారకుండా చేస్తాయి.

- టీలో కెఫిన్‌, ధియామిన్‌ లాంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి లిమిట్‌ దాటితే శరీరానికి నష్టం తప్పదు. టీ తాగేముందు ప్రతిసారీ మంచినీళ్లు తాగడం వల్ల... ఒంట్లోకి చేరిన కెమికల్స్‌ని ఎప్పటికప్పుడు బయటకి పంపే అవకాశం ఉంటుంది.

ఇక నోరు dryగా ఉన్నప్పుడు టీ తాగేకంటే, ఓ గుక్కుడు మంచినీళ్లు తాగిన తర్వాత టీ తాగితే... దాని రుచిని పూర్తిగా ఆస్వాదించవచ్చని అంటారు. మనలో చాలామంది టీ అలవాటుని మార్చుకోలేం. కానీ దానికి మరో చిన్న అలవాటుని జోడించడం వల్ల ఎంత ఉపయోగమో చూశారు కదా!

- Nirjara