కడప మాదిరిగా యురేనియం తవ్వకాలకు బలికాబోయిన ఆళ్లగడ్డ...

కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు.

రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి.

యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.