అవగాహన పెంచడమే మార్గం లేదు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులను, టీనేజర్లను బలి తీసుకుంటోన్న ప్రాణాంతక బ్లూవేల్ గేమ్‌ను దేశంలో నిషేధించలేమని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ఈ క్రీడను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన సుప్రీం దీనిని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరగా.. దీన్ని బ్యాన్ చేయడం కష్టమని సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది. ఈ ప్రాణాంతక ఆట బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలంటే వారిలో దీనిపై అవగాహన పెంచడమే ఏకైక మార్గమని తెలిపింది. ఆ అవగాహన ఎలా తీసుకురావాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=myQfGiYHC4o