ప్రతిభే కాదు.. ప్రవర్తన కూడా ఉండాలి.

ప్రతిభ ఉంటే చాలు గెలుపు మనదవుతుంది అనుకుంటాం.. కానీ ప్రవర్తన సరిగాలేకపోతే గెలుపు దూరమయ్యే ప్రమాదం ఉంది.. దానికి ఉదాహరణే ఫిఫా వరల్డ్ కప్.. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్, క్రొయేషియా దేశాలు తలబడిన విషయం తెలిసిందే.. ఫైనల్ మ్యాచ్ గెలిచి ఫ్రాన్స్ టైటిల్ గెలిస్తే, క్రొయేషియా తన పోరాట పటిమతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది.. అలానే క్రొయేషియా టీం తరుపున ఆడిన ప్లేయర్స్ హీరోలు అనిపించుకుంటున్నారు.. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం విలన్ అయ్యాడు.. అతనే నికోలా కాలినిచ్.

 

 

ఈ వరల్డ్ కప్ క్రొయేషియా, నైజీరియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కాలినిచ్ బెంచ్ లో ఉన్నాడు.. ఆట చివరి ఐదు నిముషాలు ఉండగా కోచ్, కాలినిచ్ ని ఆడమన్నాడు.. దానికి అతను నాలాంటి టాప్ ప్లేయర్ ఐదు నిముషాలు ఆడటం ఏంటి అంటూ నిరాకరించాడు.. దీంతో కోచ్ వేరే ప్లేయర్ ని ఆడించాడు.. మ్యాచ్ తరువాత కోచ్ స్టాఫ్ అతన్ని క్షమాపణలు చెప్పమని కోరారు.. దానికి కూడా కాలినిచ్ ఒప్పుకోలేదు.. దీంతో అతన్ని కోచ్ టీం నుండి తొలిగించాడు.. అయినా అతనిలో బాధ లేదు.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.. అదే కాలినిచ్ ప్లేస్ లో వేరే ప్లేయర్ ఉండుంటే.. చివరి ఐదు నిముషాలు ఆడటానికి ఒప్పుకునేవాడు, కనీసం మ్యాచ్ అయ్యాక సారీ అయినా చెప్పేవాడు.. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రొయేషియా టీం మెంబెర్స్ అంతా హీరోలు అయ్యారు.. కాలినిచ్ మాత్రం విలన్ గా మిగిలిపోయాడు.. ఆటగాడికి ప్రతిభతో పాటు ప్రవర్తన ముఖ్యమని కాలినిచ్ ఇప్పటికైనా తెలుసుకుంటాడో లేదో.