తెలంగాణ కుర్రాడిని కలుస్తానంటున్న ట్రంప్

 


సినిమా హీరోలకి, అభిమానులు పాలాభిషేకాలు చేయడం, గుడులు కట్టడం, పూజలు చేయడం చూస్తుంటాం.. కానీ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు వెరైటీగా 'అమెరికా అధ్యక్షుడు ట్రంప్' ఫోటోకి పూజలు చేస్తున్నాడు.. కృష్ణకి ట్రంప్ అంటే విపరీతమైన అభిమానమాట.. ఈ అభిమానం ఇప్పుడు పుట్టింది కాదు.. ట్రంప్ కొన్నేళ్ల క్రితం డబ్ల్యూడబ్ల్యూ అనే షోకి హోస్ట్ గా చేసేవాడు.. ఈ షో చూసిన కృష్ణ అప్పటినుండి ట్రంప్ కి అభిమాని అయ్యాడు..

ఆ అభిమానం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆ అభిమానం ఇంకా పెరిగింది.. ఎంతలా అంటే ట్రంప్ ఫోటోని ఇంట్లో పెట్టుకొని పూజ చేసే అంతలా .. ఈ మధ్య కృష్ణ తను ట్రంప్ కి పూజ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. ఈ విషయం ట్విట్టర్ పుణ్యమా అని ట్రంప్ వరకు వెళ్ళింది.. మరి ట్రంప్ ఊరుకుంటాడా.. తన అభిమాని కోసం స్పందించాడు.. 'కోట్ల భారతీయుల్లో కృష్ణ నా ఆప్తమిత్రుడు' అన్నాడు.. అంతేనా త్వరలో కలుద్దాం అన్నాడు.. ట్రంప్ స్పందించడంతో కృష్ణ తెగ సంబరపడిపోతున్నాడు.