దినకరన్‌కు చుక్కెదురు..

 

అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌కు చుక్కెదురైంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శశికళను కలిసేందుకు వెళ్లిన దినకరన్ కారును జైలు ప్రాంగణంలో రెండవ నిఘా కేంద్రం వద్ద నిలిపివేశారు. అయితే ఆయన అక్కడ రెండు గంటలు వేచి ఉన్నా శశికళను కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో నిరాశ చెందారు. కాగా ముడుపుల వ్యవహారం ఆరోపణలపై చర్చించేందుకు శశికళను కలవడానికి దినకరన్ వెళ్లినట్లు ప్రచారంలో జరుగుతోంది.