ఆ మాట ఎందుకన్నాడో!

Publish Date:Nov 12, 2013

Advertisement

 

 

 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఫెయిల్... ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఫెయిల్... దిగ్విజయ్ సింగ్ ఎక్కడ లెగ్గు పెట్టినా తాను ఫెయిలవుతూ, లెగ్గు పెట్టిన ప్రదేశాన్నీ ఫెయిల్ చేస్తూ మిస్టర్ ఫెయిల్యూర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడా పనికిరానివాడు రాజకీయాల్లో పనికొస్తాడని అంటారు. రాజకీయాల్లో కూడా పనికిరాకుండా పోయిన దిగ్విజయ్ ఇంకెక్కడ పనికొస్తాడో ఏంటో!

 

ఈమధ్యకాలంలో దిగ్విజయ్ చేస్తున్న కామెంట్లు, కొడుతున్న పంచ్ డైలాగ్స్ వింటుంటే ఫ్యూచర్లో దిగ్విజయ్ సింగ్ సినిమా రైటర్‌గా ట్రై చేస్తే బెటరేమోననిపిస్తోంది. ఎప్పుడు మీడియావాళ్ళు మాట్లాడించినా ‘‘అన్ని పార్టీలూ ఒప్పుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించింది’’ లాంటి రొటీన్ డైలాగ్స్ కొడుతూ వుంటాడు. ఇతను ఇలా రొటీన్‌గా మాట్లాడేస్తూ ఉంటాడులే అనుకుని ఫిక్సయితే, సడన్‌గా సమైక్యవాదుల గుండెల్లో బాంబులు పేలే డైలాగ్ కొడతాడు. ఆ బాంబుల ధాటికి విలవిలలాడుతున్న సమైక్యవాదులను చూసి విభజనవాదులు సంతోషిస్తూ వుంటారు.  అయితే వాళ్ళ సంతోషం కూడా ఎక్కువకాలం నిలవదు. వాళ్ళకి షాక్ తగిలే డైలాగ్ ఒకటి దిగ్విజయ్ కొట్టడంతో వాళ్ళు కూడా విలవిలలాడుతూ వుంటారు.ఇలా డైలాగుల మీద డైలాగులు కొడుతూ అటు సమైక్యవాదులని, ఇటు విభజనవాదులని మాటలతో కొడుతున్న దిగ్విజయ్ సింగ్ భవిష్యత్తులో  సినిమాల్లో పంచ్ డైలాగుల రచయితగా స్థిరపడతాడని ఆశిద్దాం. సరే ఆయనగారి ఫ్యూచర్ ఎలా వున్నా, ప్రెజెంట్‌లో ఆయన కొట్టిన ఓ పంచ్ డైలాగ్ విభజనవాదులని కంగారుపెడుతోంది. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ళ తర్వాత విభజనవాదులు పశ్చాత్తాపపడతారు’’ అని దిగ్విజయ్ సింగ్ సార్ అన్నారట.ఆ మాట దిగ్విజయ్ ఎందుకన్నాడో, అలా అనడం వెనుక అసలు ఉద్దేశమేంటో అర్థంకాక విభజనవాదులు అదరిపోతున్నారు. పదేళ్ళ తర్వాత తెలంగాణవాదులు పశ్చాత్తాపపడే పరిస్థితులని క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఏదైనా మెలికలు పెట్టబోతోందా అనే అనుమానం విభజనవాదులను పట్టి పీడిస్తోంది. అందుకే కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రతి అంశాన్నీ భూతద్దంలో చూసి విభజనవాదులు బెదిరిపోతున్నారు.

By
en-us Political News