అతిసార వ్యాధి

విరేచనాలు అధికముగా అయ్యేవ్యాధిని అతిసార వ్యాధి అని అంటారు. ఇది వచ్చేముందు ఉదరము, పొత్తికడుపు యందు నొప్పి, అసానవాతము బయలు వెడలకుండుట, మలబంధము, కడుపుబ్బరము, అజీర్ణము అను లక్షణాలు కలుగుతాయి. కొందరిలో నురుగుతో కూడిన విరేచనాలు మరి కొందరిలో రక్తవర్ణమలము, లేదా చిక్కని కఫముతో దుర్గంధయుక్తముగా విరేచనాలు అవుతాయి. 

 

ముందుజాగ్రత్తలు: లంఘనము, పమనము, నిదురబోవుట, ప్రాతవియగు శాలిధాన్యము, షష్టిక ధాన్యము, విలేపి,పేలాలగంజి, చిరుశనగల కట్టు, కందికట్టు, కుందేలు, జింక, లావకపిట్ట, లేడి, కాజు వీని మాంసరసములు, చిన్నవి యాగు చేపలు దుప్పి తైలము, మేక, ఆవు, ఈ జంతువుల యొక్క నెయ్యి,పాలు, పెరుగు, మజ్జిగ, పెరుగు నుండి తీసిన వెన్న పాలలో తీసిన వెన్న, లేత అరటికాయ అరటి పువ్వు, పొట్లకాయ, తేనె, నేరేడు పండ్లు, అత్తికాయలు, అల్లము,శుంఠి, తెల్లతామరగడ్డలు, వెలగ పొగడ, మారేడు, తుమికి పండు,పుల్లదానిమ్మ. తియ్యదానిమ్మ ఎర్రతామరగడ్డ, బూరుగ, పులిచింతాకు, గంజాయి ఆకు, మంజిష్ట, జాజికాయ,నల్లమందు జీలకర్ర, కొడిశపాల, ధనియాలు, తురకవేప, వగరు గల అన్ని పదార్ధములు. అగ్ని దీప్తిని కలిగించునవి. లఘువుగ ఉండెడునవియు అగు పదార్ధములు. అన్నియు అతిసార వ్యాధి హితకరములు.

మందుజాగ్రత్తలు:  మారేడు గుజ్జు చూర్ణము బెల్లముతో కలిపి సేవిస్తే కడుపునొప్పి మలబంధము, కడుపుబ్బరము, అతిసారములు హరిస్తాయి. ధనియాలు శుంఠి కషాయం ఆకలిని పెంచుతాయి. కొడిశపాలపట్ట, అతివస వీని చూర్ణము తేనెలో కలిపి సేవిస్తే అతి సారశమిస్తుంది. కరిక పిందెలు, జీలకర్ర వీనిని కొంచెము వెచ్చచేసి చూర్ణించి బియ్యము కడుగు నీళ్ళతో సేవిస్తే అతిసారం నశిస్తుంది.మారేడు గుజ్జు మామిడి జీడి దీని కషాయమందు తేనె చక్కెర కలిపి సేవిస్తే వాంతి విరేచనాలు హరిస్తాయి.